ఐశ్వర్యరాయ్ ఉన్న ఇంట్లో అగ్ని ప్రమాదం

       ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న హైరైజ్ అపార్ట్మెంటులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి ఎనిమిది ఫైరింజన్లు పని చేసాయి. హైరైజ్ అపార్ట్మెంటు 12వ అంతస్తులో ఐశ్వర్యరాయ్ తల్లి ఉంటుంది. పెళ్లికాక ముందు ఐశ్వర్యరాయ్ తల్లితో కలిసి ఇక్కడే ఉండేది. పెళ్లి తరవాత జుహులోని భర్త నివాసానికి ఐశ్వర్య వెళ్లిపోయింది.

      అయితే, ప్రమాదం విషయం తెలియగానే.. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇదే అపార్ట్ మెంట్ లోని 10వ అంతస్తులో సచిన్ టెండూల్కర్ బంధువులు ఉంటున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది ? అన్నది తెలియాల్సి ఉంది.