బ్రేకింగ్.. చంద్రబాబుకి తృటిలో తప్పిన పెను ప్రమాదం ! :Chandrababu Naidu Convoy Accedent

105
Chandrababu Naidu Convoy Accedent
 మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీనితో చంద్రబాబు కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి.

Chandrababu Naidu Convoy Accedent

 విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో కాన్వాయ్ హైదరాబాద్‌కు పయనమైనట్లు తెలుస్తోంది.
 కాగా, ప్రతీ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉంటారన్న సంగతి తెలిసిందే.
Chandrababu Naidu Convoy Accedent