అవును ఆ దర్శకుని మనవరాలే.. షాకింగ్ విషయాలు చెప్పిన దేవి తల్లి

104
Devi Nagavalli Dasari Narayanarao Grand Daughter

తన కూతురు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన దేవి నాగవల్లి తల్లి.. దేవి కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో.. బిగ్ బాస్ హౌస్‌లో అలాగే ఉంది.. నా కూతురు ఫైటర్ బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఫైట్ చేస్తుంది. ఆమె తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చింది.

దాసరి నారాయణ రావుగారు మా అత్తయ్య తమ్ముడు.. మా ఆయనకు మేనమామ.. దేవికి తాతయ్య అవుతారు. మేము అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటాము.. ఏదైనా సందర్భం ఉంటే దాసరి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాము.

Devi Nagavalli Dasari Narayanarao Grand Daughter

అయితే దాసరి నారాయణరావు గారిని మేం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. నరసాపురం, పాలకొల్లులో ఆయనకి మాకూ చాలామంది చుట్టాలు ఉన్నారు. దాసరి నారాయణ రావుగారిది పాలకొల్లే కదా. చాలాసార్లు కలిసేవాళ్లం.

Devi Nagavalli Dasari Narayanarao Grand Daughter