దిశ ఎనకౌంటర్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన RGV

55
disha trailer

హైదరాబాద్‌ నగర శివర్లలో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘దిశా ఎన్‌కౌంటర్’. ఈ సినిమా గురించి చెప్పినట్టే వర్మ ఈ ఉదయం 9 గంటల 8 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేశాడు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు దిశను ఎలా హింసించినది తదితర ఘటనలు ట్రైలర్ లో చూపించాడు వర్మ. నవంబర్ 26, 2020లో సినిమా విడుదల కాబోతుంది.

Disha Trailer

హైదరాబాద్ లో ఏడాది క్రితం సంచలనం రేపింది వెటర్నరీ డాక్టర్‌ దిశ అత్యాచార ఘటన. ఈ కేసులో నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి నిన్న న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

RGV Released Disha Trailer