కరోనా బారిన పడ్డ ట్రంప్ దంపతులు

42
Donald trump Corona Positive

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్‌గా తేలిందని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

Donald trump Corona Positive

అంతకుముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వద్ద సలహాదారిణిగా సేవలందిస్తున్న హోప్ హిక్సు కరోనా వైరస్ బారిన పడింది. లక్షణాలు రావడంతో టెస్టులు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులలో కంగారు మొదలైంది.

Donald trump Corona Positive

ఆ వెంటనే డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు కోవిడ్19 టెస్టులు చేయించుకోగా రెండు గంటల అనంతరం తమ కోవిడ్19 టెస్టుల ఫలితాలు వచ్చాయని.. తనతో పాటు భార్య మెలానియాకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Donald trump Corona Positive