ట్యూషన్‌కు వెళ్లిన 14 మంది విద్యార్థులకు కరోనా

83
Fifteen Children Tested Corona Positive in Guntur

మాస్టర్‌కు కరోనా సోకడంతో ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులంతా కరోనా బారినపడ్డారు. గుంటూరు లోని సత్తెనపల్లి మండలం భట్లూరులో 14 మంది చిన్నారులకు కరోనా సోకిందని వైద్యాధికారలు వెల్లడించారు. ట్యూషన్ చెప్పే మాస్టార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వద్దకు ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Fifteen Children Tested Corona Positive in Gunturవిద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులే కావడం మరింత బాధాకరం. వైద్య అధికారులు విద్యార్థులను NRI క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో కూడా కొందరికి కరోనా పాజిటీవ్ రావడంతో అధికారులు హుటాహుటిన ఆ గ్రామంలో సహయక చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలు ఉన్న అందరినీ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలసింది గా సూచిస్తున్నారు.

Fifteen Children Tested Corona Positive in Guntur