50 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్ష రాసిన సీనియర్ నటి..

51
Hema Degree Exam

50 ప్లస్ వయసులో డిగ్రీ పరీక్ష రాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది సీనియర్ నటి హేమ. కరోనా కాలంలో ఆమె నల్గొండ జిల్లాకు వెళ్లి మరీ పరక్ష రాయడం విశేషం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివేందుకు దరఖాస్తు పెట్టుకున్న హేమ.. ఆదివారం నల్గొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో అర్హత పరీక్ష రాసింది.

Hema Degree Exam

తనకు ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని, ఇప్పటికి అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టానని హేమ చెప్పింది. మరి నల్గొండకు వెళ్లి పరీక్ష ఎందుకు రాశారని అడిగితే.. కరోనా టైం కావడంతో హైదరాబాద్లో కేసులు ఎక్కువ ఉండటం,  ట్రాఫిక్ ను కూడా దృష్టిలో ఉంచుకుని నల్గొండను సెంటర్ గా ఎంచుకున్నట్లు హేమ వెల్లడించింది.

Hema Degree Exam

ఎవరి తెలీకుడదు అని తాను అనుకున్నప్పటికీ మీడియా దృష్టిలో పడిపోయానని ఆమె అంది. ప్రస్తుతం తాను రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నానని.. అక్కడి నుంచే నల్గొండకు వచ్చి పరీక్ష రాశానని ఆమె వెల్లడించింది.

Hema Degree Exam write at Nalgonda