గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన జయప్రకాష్ రెడ్డి..

127
Jayaprakash Reddy Passed Away

 టాలీవుడ్‌లో తీరని విషాదం నెలకొంది. సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లోనే కుప్పకూలగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Jayaprakash Reddy Passed Away

 అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి స్వంత ఊరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల.

Jayaprakash Reddy Passed Away

 సినిమాల్లోకి రాకముందు si గా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి పలు నాటకాలలో నటించారు, అదే సమయంలో ఆయన బ్రహ్మపుత్రుడు సినిమాలో ఛాన్స్ రావడంతో వెండితెరపై అడుగుపెట్టారు.

Jayaprakash Reddy Passed Away

 చివరిసారిగా సరిలేరు నీకెవ్వరులో కనిపించి మనల్ని నవ్వించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి.

Jayaprakash Reddy Passed Away