హీరోయిన్ పై పార్కులో దాడి ఘటనపై కాజల్ రియాక్షన్.

134
kajal support to samyuktha

 బెంగళూరులోని ఒక పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వర్కౌట్లు చేస్తోన్న కిరాక్, మన్మధుడు 2 సినిమా ల్లో నటించిన కన్నడ హెరోయిన్ సంయుక్త హెగ్డేపై కాంగ్రెస్స్ పార్టీ మెంబర్ కవితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Kajal Support to Samyuktha

 పార్కులో ఇలాంటి బట్టలు వేసుకుని డ్యాన్సులు చేస్తారా అంటూ ఆమె సంయుక్త హెగ్డే, ఆమె స్నేహితురాలిని మందలించారు అంతే కాకుండా ఆమె స్నేహితురాలిపై చేయి కూడా చేసుకోబోయారు.

 అప్పటికే పార్కులో ఉన్న మగాళ్లంతా గుమికూడి ఆ పెద్దావిడకే సపోర్ట్ చేశారు. అక్కడ జరిగిన తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు సంయుక్త.

Kajal Support to Samyuktha

 ఈ ఘటనపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పందిస్తూ “ఓరి దేవుడా సామ్! ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు, మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మీ ఫ్రస్ట్రేషన్‌, కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. వీటన్నింటినీ మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది” అని ట్వీట్ చేశారు.

Kajal Support to Samyuktha

 కాజల్ తో పాటుగా శ్రద్ధ శ్రీనాధ్ , కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ కూడా సంయుక్త కు సపోర్ట్ చేశారు.

Kajal Support to Samyuktha

కాగా సంయుక్తకు కవితా రెడ్డి క్షమాపణలు చెప్పారు.

Kajal Support to Samyuktha