బిగ్‌బాస్‌ పరువు తీసిన హీరోయిన్.. వేరే వాళ్ల దొడ్లు కడుగుతూ, గిన్నెలు తోమడం కూడా ఒక బ్రతుకేనా?

93
Lakshmi Menon

అతిపెద్ద రియాలిటీ షో అయిన ‘బిగ్‌బాస్‌’ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఇప్పటికే నాలుగో సీజన్‌ ప్రసారమవుతుండగా తమిళ్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్న సీజన్-4 అక్టోబర్ 4 నుండి టెలికాస్ట్ కానుంది.

Lakshmi Menon

ఈ నేపథ్యంలో తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌ తమిళ బిగ్‌బాస్‌ 4 లో కంటెస్టెంట్‌ గా రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై లక్ష్మీమీనన్‌ ఘాటుగా స్పందించింది.

Lakshmi Menon

”నేను బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేయడం లేదు. నేను వేరేవాళ్లు తిన్న ప్లేట్స్‌ను కడగడం, టాయ్‌లెట్స్‌ శుభ్రం చేయడం వంటి పనులు ఇప్పటి వరకు చేయలేదు, చేయను కూడా. షో పేరుతో కెమెరాల ముందు ఫైటింగ్‌ చేయడం, నటించడం నాకు నచ్చదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఏదో షిట్‌ షోలో పాల్గొంటానని వస్తున్న వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను” అని వ్యాఖ్యానించింది.

Lakshmi Menon

పార్టిసిపేట్ చేస్తే, చేస్తున్నానని లేకపోతే లేదని చెప్పాలి కానీ ఇలా మాట్లాడడం తగదు అంటూ లక్ష్మీమీనన్‌కు సలహా ఇస్తున్నారు తమిళ ప్రేక్షకులు.

Lakshmi Menon

  • 3
    Shares