సర్కారీ వారి పాటకు బేస్మెంట్ వీళ్ళేనట..

50
Mahesh Babu movie Sarkaru Vaari Pata

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే చిత్రంలో కధానాయకుడు కాగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథ ప్రకారం అమెరికా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. త్వరలో సర్కారు వారి పాట టీమ్ అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.

Mahesh Babu movie Sarkaru Vaari Pata

ఇకబోతే ఈ మూవీలో మహేష్‌కి విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నారట. ఇప్పటికే అరవింద్ స్వామి డేట్లను ఇచ్చేశారని టాక్. ముందుగా ఈ పాత్ర కోసం ఉపేంద్ర ని ఆడగగా అందుకు ఆయన ఒప్పుకోలేదు. చివరికి అది అరవింద్ దగ్గరకి వచ్చి చేరింది.

Mahesh Babu movie Sarkaru Vaari Pata

అలాగే మహేష్ సోదరి పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఒకవేళ ఇవే నిజమైతే సినిమాకు వీరిద్దరు అస్సెట్‌గా మారనున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.

Mahesh Babu movie Sarkaru Vaari Pata