సీటీ స్కాన్‌లో బయటపడిన విషయం.. మెదడులో ఎలా వెళ్ళాయి..?

63
Needles Found in Womans Head

చ‌ర్మానికి సూదితో కొంచెం గుచ్చితేనే ఉలిక్కిపడతాం. అలాంటిది ఒక మ‌హిళ మెద‌డులోకి చొచ్చుకొని పోయాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ సూదులు ఆమె మెద‌డులోకి ఎప్పుడు, ఎలా వెళ్లాయో ఆమెకే తెలియ‌దు. త‌ల‌మీద చిన్న గాయం, మ‌చ్చ కూడా లేదట‌. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు గాయాలు త‌గ‌ల‌క‌పోయిన‌ప్ప‌టికీ వైద్యుల‌ను సంప్ర‌దించింది.

Needles Found in Womans Head

వారు అన్ని టెస్టులతో పాటుగా సీటీస్కాన్ కూడా చేశారు. స్కాన్ రిపోర్టులో విష‌యం బ‌య‌ట ప‌డింది. జుహు మెద‌డులో 4.9 మి.మీ. పొడ‌వున్న 2 సూదులు క‌నిపించాయి. కానీ ఇవి యాక్సిడెంట్ వ‌ల్ల జరిగినది కాదు. దీంతో షాక్‌కు గురైన వైద్యులు ఆమెను విచారించారు. కానీ త‌ల‌కు సంబంధించిన గాయ‌లు, ప్ర‌మాదం, స‌ర్జ‌రీలు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పింది.

Needles Found in Womans Head

చిన్న‌ప్పుడు జుహు త‌ల్లిదండ్రులు యాత్ర‌ల‌కు వెళ్లేట‌ప్పుడు త‌న‌ని త‌న పిన్ని ఇంట్లో వ‌దిలేసి వెళ్లేవార‌ట‌. అప్పుడు పిన్ని జుహు త‌ల మీద రెండు మ‌చ్చ‌లు చూసిన‌ట్లు చెప్పింద‌ని జుహు త‌ల్లిదండ్రులు వైద్యుల‌కు వెల్ల‌డించారు. ఇప్పుడు త‌ల‌మీద గాయ‌లు, మ‌చ్చ‌లు లాంటివి క‌నిపించ‌క‌పోయేస‌రికి వైద్యుల‌కు ఏం అర్థం కాలేదు. ఈ సూదులు ఇలానే ఉంటే ప్ర‌మాదం వెంట‌నే స‌ర్జ‌రీ చేసి తొలిగించాల‌ని వైద్యులు వెల్ల‌డించారు.

Needles Found in Womans Head

కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు.

Needles Found in Womans Head