‘చెక్’ పెట్టేందుకు రెడీ అయిన నితిన్!! టైటిల్ పోస్టర్‌ లో ఇవి గమనించారా?

41
Nithin Check Movie

నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కబోతోన్న చెక్ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను అక్టోబర్ 1 సాయంత్రం 4 30 గంటలకు కొరటాల శివ చేతుల మీదుగా మూవీ టైటిల్ అండ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక కేసు, జైలు ఆధారంగా తెరకెక్కబోతుంది.

Nithin Check Movie

తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీ అని ఆయన తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని కొరటాల చెప్పుకొచ్చాడు. ఇక ఈ టైటిల్ పోస్టర్‌లోనే ఎన్నో హింట్స్ వదిలారు.

Nithin Check Movie

ఇదో మైండ్ గేమ్కి సంబందించిన చిత్రమని పోస్టర్ చూసి చెప్పేయొచ్చు. చదరంగంలో అన్నీ కాయిన్స్ పడిపోగా అటు సైడు ఇటు సైడు రాజు మాత్రమే మిగిలి ఉంది. ఇక చెక్ అంటూ వచ్చిన టైటిల్ మధ్యలో గుర్రం బొమ్మ డిజైన్ వచ్చేలా సెట్ చేశారు.

Nithin Check Movie

చదరంగం ఆటలో గుర్రం ఎంత పవర్‌పుల్ అన్నది అందరికీ తెలిసిందే. చేతికి సంకెళ్లు..కంచె.. ఇలా పోస్టర్‌తోనే మెదడుకు పని పెట్టేశారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్‌ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు.

Nithin Check Movie