పోలీసుల అదుపులో తెలుగు బిగ్ బాస్ నిందితుడు :Nutan Naidu Arrest

73
nutana naidu arrest

  విశాఖపట్నం శిరోముండనం కేసులో పరాన్నజీవి నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు కర్ణాటకలోని ఉడుపిలో పట్టుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని ఉడుపిలో పోలీసులు పట్టుకున్నారని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.

nutan naidu arrest

  విశాఖలోని పెందుర్తిలో నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ పనిచేసేవాడు. అయితే, వారి ఇంట్లో పనిమానేసిన తరవాత అతడిని పిలిపించిన నూతన్ నాయుడు కుటుంబసభ్యులు అతడు ఫోన్ దొంగతనం చేశాడంటూ కొట్టారు. అలాగే, అతడికి శిరోముండనం చేశారు. ఈ వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

nutan naidu arrest

  అయితే బాధితుడు శ్రీకాంత్‌ను కొన్ని రోజుల క్రితం ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌, వైసీపీ నగర కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు శ్రీకాంత్‌ ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు.

 Nutan Naidu Arrest