నెగెటివ్ రోల్ లో నటించనున్న హీరోయిన్ పూర్ణ..

45
Poorna plays a negative role

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి పాత్రలు చేసినప్పటికీ అదృష్టం కలిసిరాక విజయాలను అందుకోలేకపోతున్నారుకొంతమంది హెరోయిన్లు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ఒకరు. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కనువిందు చేస్తూనే ఉంది. పూర్ణ ఢీ షోలో జడ్జిగా కూడా కొనసాగుతుంది.

Poorna plays a negative role

ఇక శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి పూర్ణ. ఆ తర్వాత ఆమె సీమటపాకాయ్‌, అవును, అవును 2, రాజుగారి గది వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు లో కూడా ఒక మెరుపు మెరిసింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన ఈమె ఇపుడు నెగెటివ్ రోల్ లో అలరించేందుకు సిద్దమవుతోంది.

Poorna plays a negative role

తాజాగా రాజ్‌తరుణ్ – విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక రొమాంటిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం పూర్ణ అయితే బాగుంటుందని డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా ఫిక్సయ్యాడని సమాచారం.

Poorna plays a negative role

అంతేకాదు ఈ రోల్ కోసం పూర్ణ మేకోవర్ ను కూడా కొద్దిగా మార్చాల్సి ఉంటుందని చెప్పినట్టు చిత్రపరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి పూర్ణ ఈ సారి కొత్త లుక్ లో ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి. పూర్ణ ఈ ఏడాది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది.

Poorna plays a negative role
  • 4
    Shares