భార్యను కొట్టిన ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌ (వీడియో)

80
Purushottam Sharma IPS

మధ్యప్రదేశ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పురుషోత్తమ్‌ శర్మ భార్యపై విచక్షణా రహితంగా దాడి చేస్తూ వీడియో కి చిక్కడంతో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యి విషయం వెలుగులోకి వచ్చింది. పురుషోత్తంశర్మ తన భార్యను కొట్టి, కింద పడేసి, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Purushottam Sharma IPS

అయితే అతన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వీధుల నుండి సస్పెండ్‌ చేసింది. స్థానికంగా ఓ టీవీ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న యువతితో శర్మ వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆయన భార్య అనుమానమే ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా, శర్మ తనకు తండ్రి వంటి వారని, సమాజంలోని అధికారులతో మాట్లాడటం తన వృత్తిలో భాగమని సదరు యాంకర్‌ తెలిపారు.

Purushottam Sharma IPS

పురుషోత్తం శర్మ కుమారుడు మాట్లాడుతూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న తన తండ్రిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కోపంతోనే తన తల్లిపై దాడికి దిగారని అన్నాడు. పురుషోత్తం శర్మ స్పందిస్తూ.. తాను అంతగా హింసిస్తుంటే.. 32 ఏళ్లుగా ఆమె తనతో ఎలా కాపురం చేయగలిగిందో తన కుమారుడు చెప్పాలని అన్నారు.

Purushottam Sharma IPS relieved of duties after video of him beating wife goes viral