అవను.. నేను దొంగానే.. గ్రహాంతరవాసిని..! రష్మిక

47
Rashmika Mandanna

కథానాయిక రష్మికా మందన్నా కు ఓ వింత అలవాటు ఉంది. సినిమా షూటింగుల కోసమని రకరకాల ప్రదేశాలకు వెళతారు. అయితే అక్కడి హోటల్స్‌లో షాంపూలు నచ్చితే వాటిని దొంగిలిస్తానని రష్మికా మందన్నా తాజాగా ట్విట్టర్‌ లైవ్‌ సెషన్‌లో చెప్పారు. ఒకసారి పిల్లో కవర్‌ కూడా దొంగిలించానని ఆమె అన్నారు.

Rashmika Mandanna

ప్రతి విషయానికి నవ్వడం, ఎక్కువ ఆందోళన చెందడం, హైపర్‌గా ఉండటం… ఈ మూడు అలవాట్లు తనను బాధిస్తున్నాయని రష్మిక తెలిపారు. ‘no’ చెప్పాల్సిన సందర్భాలలోనూ నవ్వుతూ చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తులు కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారని ఆమె అన్నారు. తానొక గ్రహాంతరవాసిని అని అనుకుంటూ ఉంటానని రష్మిక నవ్వారు.

Rashmika Mandanna

ప్రస్తుతం IPL మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రష్మిక మద్దతు ఎవరికి? అని ప్రశ్నించగా… ”ఎవరు విజేతగా నిలుస్తారో నాకు తెలియదు. కానీ, అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. విన్నర్‌కి కంగ్రాట్స్‌. నేను అందరికీ మద్దతు ఇస్తా. నాకు యాంగ్జైటీ ఇష్యూలు ఉన్నాయి. మ్యాచ్‌ మొత్తం చూస్తే… ఆ స్ట్రెస్‌ డీల్‌ చేయలేను. అందుకని, మ్యాచ్‌ చూడను” అని ఆమె సమాధానం ఇచ్చారు.

Rashmika Mandanna

  • 2
    Shares