రియల్ హీరో సోనూ సూద్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన టీం

47
Real Hero Sonu Sood

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు పాల్గొన్నారు. సెట్లోకి సోనూ ఎంటర్ అవ్వగానే చిత్ర యూనిట్ మొత్తం సోనూకి చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్ కి సాలువతో సత్కరించారు. అనంతరం ఓ జ్ఞాపికను కూడా బహూకరించి అభినందిచారు.

Real Hero Sonu Sood

కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఏకంగా 8 ప్యాక్స్‌ కోసం చాలా కస్టపడ్డాడంట.

Real Hero Sonu Sood

ఇక సినిమాల్లో విలన్ గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా అనిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

Real Hero Sonu Sood

  • 11
    Shares