మహారాష్ట్ర తరవాత సీఎం కంగనా.. కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదు

101
rgv comments on kangana vs shivasena

 సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు దర్శకుడు RGV.  ఇటీవల సుశాంత్‌  సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం, మీడియా అటెన్షన్‌, సీబీఐ దర్యాప్తుపై స్పందించిన రామ్‌ గోపాల్‌ వర్మ కంగనా వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై స్పందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.

rgv comments on kangana vs shivasena

 ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్‌ అవుతుందనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్‌ వాళ్లందరూ టింబక్టుకు (మలి అనే దేశంలోని ఓ నగరం) మకాం మార్చాలి.

rgv comments on kangana vs shivasena

 అయితే మరో ట్వీట్‌ చేసిన వర్మ.. కంగనా ముఖ్యమంత్రి అయితే అర్నాబ్ గోస్వామి ప్రధానమంత్రి అవుతాడు. శివసేన మాయమైపోవడం ఖాయం, ముంబాయి పోలీసు ప్లేస్ లో రిపబ్లిక్ టీవి వస్తుంది, ఇకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇటలీ పారిపోతారు .. దేవుడా..అని ట్వీట్ చేశారు.

rgv comments on kangana vs shivasena

  ఇక మూడో ట్వీట్ గా ‘కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్‌ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదు’. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

RGV Comments on Kangana vs Shivasena