రియల్ హీరో సోనూసూద్.. బాలుడి కాలేయ మార్పిడికి రూ. 20 లక్షల సాయం..

69
Sonu Sood Helps 6 Years Boy for Liver Problem

లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రీల్ విలన్‌ కాస్తా రియల్‌ హీరోగా మారిపోయాడు సోనూసూద్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. హర్షవర్ధన్ అనే ఆరేళ్ళ బాలుడి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిమిత్తం రూ. 20 లక్షల ఆర్ధిక సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు.

Sonu Sood Helps

మహబూబాబాద్‌ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మీ దంపతుల కుమారుడు హర్షవర్దన్ గత ఆరున్నర నెలల నుంచే కాలేయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. మందులు వాడుతూ వస్తున్నారు కానీ తాజాగా అతడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

Sonu Sood Helps

బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని, రూ. 20 లక్షల ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. సోనూసూద్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రావడంతో అక్కడికి వెళ్లి నాగరాజు దంపతులు తన కుమారుడి సమస్యను చెప్పుకోగా వెంటనే స్పందించిన సోనూసూద్ బాలుడి వైద్యానికి అవసరమయ్యే రూ. 20 లక్షలు తానే భరిస్తానని ప్రకటించాడు.

Sonu Sood Helps 6 Years Boy for Liver Problem