సినిమా టైటిల్ ఎంపిక చేయడంలో ఈ యంగ్ హీరో తర్వాతే..!

117
Timmarusu Movie

 సినిమా కి పెట్టే టైటిల్ తోనే సగం హిట్టు కొట్టేయొచ్చు. అందుకే టైటిల్ విషయం లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుంటారు మన దర్శక నిర్మాతలు, హీరోలు. అలాంటి ఓ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు సత్యదేవ్.

timmarusu movie

 విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో మంచి నటుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ టాగ్ లైన్ ‘అసైన్‌మెంట్‌ వాలి’ సినిమా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Timmarusu Movie

 ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రమని తెలియజేసేలా రూపొందిన ఈ టైటిల్ లోగో మరింత ఆసక్తినిరేపుతోంది.

 ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించారు. తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు.

timmarusu movie

 ఈ నేపథ్యంలో ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీని శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించడానికి నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియయరాలేదు.

Timmarusu Movie