ఆర్టీసీ బస్సులు తిప్పినా ఎవ్వరూ ఎక్కలేదట.. ఎందుకో తెలుసా..?

54

అన్లాక్ 4 లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీస్ లు ప్రారంభించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో ఆర్టీసీ సర్వీస్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టిసి బస్సు ప్రారంభించడం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

TSRTC bus services resume today

ఇక నిన్న ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట లభించినట్లయింది. అయితే మరోవైపు ప్రజల్లో భయం కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల కారణంగా కరోనా వైరస్ ఎక్కడ అంటుతుందో అని భయం కూడా ప్రజల్లో నెలకొంది. అయితే ఆరు నెలల నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నిన్న రోడ్డెక్కాయి . నగరంలోని ప్రతి డిపో నుంచి 25 శాతం బస్సులు తిరిగాయి.

TSRTC bus services resume today

కానీ ఆర్టీసీ బస్సు లో మాత్రం ఒక ప్రయాణికుడు కూడా ఎక్క లేదట. దీంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్సులు వెలవెలబోయినట్లు తెలుస్తుంది. ఇంతకీ దీనికి కారణం ఏమిటి అని అంటారా… మొత్తం నగరంలో 29 డిపోల నుంచి 639 ఆర్టీసీ బస్సులను తిప్పారు. ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ కనిపించలేదు.. దీనికి కారణం ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే అని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ ప్రయాణికులకు రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

TSRTC bus services resume today