వెంకటేష్ తో తీస్తున్న సినిమాకి తేజా ముహూర్తం ఫిక్స్ చేసాడా..!

        తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమాకు ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ సినిమా నంబర్ 16న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. ఇప్పటికే ఓ హీరోయిన్ గా అనుష్కని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. రెండో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకొనే అవకాశం ఉంది. ఇందులో మరో పవర్ ఫుల్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలో రానా నటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.