విజయ్ లైఫ్ లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా. తెలుగు లో టీజర్ చూసారా…

193

     మార్సెల్ సినిమా సూపర్ హిట్ కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే  GSTకి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని.. వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అవన్నీ ఆ సినిమాకు మరింత ఎక్కువ ప్రచారం తెచ్చిపెట్టాయి. దీంతో ఈ మూవీ వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

      తమిళ స్టార్ హీరో.. అభిమానులు ఇళయ దళపతిగా పిలుచుకునే విజయ్ హీరోగా నటించిన మెర్సల్ మూవీ అతడి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఈ దీపావళికి మెర్సల్ థియేటర్లకు వచ్చింది వరల్డ్ వైడ్ గా మెర్సల్ ఇప్పటికి రూ. 155 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.

మెర్సల్ మూవీని తెలుగులో అదిరింది పేరుతో డబ్బింగ్ చేసారు. తమిళంతో పాటే తెలుగులోనూ రిలీజ్ చేయాలని అనుకున్నా వీలుపడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన శరత్ మరార్ ఈ మూవీ హక్కులు దక్కించుకున్నాడు. రోజులు గడుస్తున్నా తెలుగు వెర్షన్ ను థియేటర్లకు తీసుకురావడంలో ఆటంకాలు మాత్రం తొలగడం లేదు. ఎట్టకేలకు ఎలాగైతే టీజర్ ను రిలీజ్ చేసారు. సినిమా  తెలుగు లో కూడా మంచి కలెక్షన్స్ కురిపిస్తుందని భావిస్తున్నారు.