130 కోట్ల ఖాతాలు క్లోజ్, కోటికి పైగా పోస్టులు, వీడియోలను తొలగించిన ఫేస్ ‌బుక్

25

2020 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య 130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సోమవారం వెల్లడించింది. ఫేస్ బుక్  వేదికపై నకిలీ సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 35వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు ఫేస్‌బుక్‌ తమ బ్లాగ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం చేరవేసేలా ఉన్న 12 మిలియన్లకు పైగా పోస్టులను ఇప్పటి వరకు తీసివేసింది. పోస్టులతోపాటు వీడియోలను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కొవిడ్‌ వ్యాక్సిన్లపై సోషల్‌మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం జరిగింది.

ఈ కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు ఇలాంటి ప్రచారంను నిలిపి వేయాలని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన ఫేస్ బుక్ యాజమాన్యం నకిలీ వార్తలపై దృష్టిపెట్టి  అలాంటి ఖాతాలను గుర్తించి, పోస్టులను తొలగించేసింది.

  • 4
    Shares