కొన్నేళ్లుగా దోమలను చంపి నోట్‌బుక్‌లో అతికిస్తోంది..!

64

Shreya Mohapatra అనే 19 ఏళ్ల యువతికి తన 14వ ఏట డెంగ్యూ జ్వరం వచ్చింది. అయితే దీనికి కారణం ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండడమే అని గుర్తుచేసుకుంది. అప్పటినుంచి దోమల బెడదను తప్పించుకోవడానికి కొన్ని ఏళ్లుగా దోమలను చంపుతూ వస్తోంది.

దోమలను పట్టుకుని తన చేతుల్లో నలిపి చంపేసి చనిపోయిన దోమలను ఒక నోట్ బుక్‌లో అతికిస్తోంది. ఢిల్లీకి చెందిన డిజైన్ విద్యార్థి రెండు ఏళ్లు క్రితం నుంచే దోమలను చంపడం మొదలుపెట్టింది. తన 12వ తరగతి పరీక్షల సమయంలో చలికాలం కావడంతో ఇంట్లోకి ఎక్కువగా దోమలు వచ్చేవి. దోమలు కుట్టడం ద్వారా తాను పరీక్షల్లో ఏకాగ్రత చూపించలేకపోయానని చెప్పుకొచ్చింది.

అప్పుడే తాను దోమలను కుట్టుకముందే వాటిని చంపేయాలని నిర్ణయించుకున్నట్టు శ్రేయా తెలిపింది. తాను ఎన్ని దోమలను చంపాను గుర్తుచేసుకునేందుకు చంపిన దోమలన్నింటిని సేకరిస్తోంది. ఒక నోట్ బుక్‌పై నంబర్లు వేసి వాటి స్థానంలో చంపిన దోమలను అతికిస్తోంది.

ఎప్పుడైతే తన ట్విట్టర్ ఖాతాలో చంపిన దోమల ఫొటోను ‘సైకోపాత్, సీరియల్ కిల్లర్ అనే క్యాప్షన్ తో పోస్టు పెట్టిందో ఒక్కసారిగా వైరల్ అయింది. అప్పటినుంచి శ్రేయా ఫేమస్ అయిపోయింది. ట్విట్టర్ లో తాను పోస్టు చేసిన ఈ ఫొటోకు 110k లైక్స్ వచ్చాయి. 25వేల సార్లు షేర్లు చేశారు.

  • 6
    Shares