కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. క్షణాల్లో అంతా అయోమయం..

61

సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ ప‌ట్ట‌ణంలో మూడంత‌స్తుల భ‌వ‌నం పేక మేడలా కుప్ప‌కూలింది. ఆ భ‌వ‌నం ప‌క్క‌న మ‌రో భ‌వ‌న నిర్మాణం చేప‌ట్టేందుకు పిల్లర్ గుంతలు తీస్తుండ‌గా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భ‌వ‌నం కూలిన స‌మ‌యంలో అందులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో జ‌గ‌దేవ్‌పూర్ మండ‌లం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి.

ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు వరకు ఆ భవనంలో 10 మంది బోరుబావి కార్మికులు ఉన్నారు. భవనం నుంచి భారీ శబ్దాలు రావడంతో వారంతా బయటికి పరుగులు తీశారు. అనంతరం క్షణాల్లోనే భవనం నేలమట్టమైంది. కార్మికులు ఉన్న సమయంలో భవనం కూలితే భారీ ప్రాణనష్టం సంభవించేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.