బాంబులు ఎలా తయారు చెయ్యాలో నేర్పిస్తుండగా పేలుడు.. 30 మంది మృతి

32

ఈ శనివారం ఉదయం 9.15 గంటలకు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లోని దవ్లత్ ఆబాద్ జిల్లాలోని కిత్లా గ్రామంలో ఘోర బాంబు పేలుడు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు విదేశీ ఉగ్రవాదులతో సహా మొత్తం 30 మంది తాలిబాన్ తీవ్రవాదులు మృతిచెందారు. కిత్ల గ్రామంలోని మసీదులో వీరందరికి బాంబు తయారుచేయడం గురించి క్లాస్ జరగుతుండగా ఈ పేలుడు సంభవించింది.

కిత్ల గ్రామం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉజ్బెకిస్తాన్‌తో సరిహద్దుకు ఆనుకొని ఉంటుందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయని, కానీ, ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ అన్నారు.

  • 6
    Shares