అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన RRR హీరోయిన్

38

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో రాంచరణ్‌ కు జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ భామ అలియా భట్ స్వల్ప అస్వస్థతకు లోనైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ చిత్రీకరణ సమయంలో ఆమె హైపర్ ఎసిడిటీ, అలసట, వికారం కు లోనైంది.

గంగూబాయి చిత్ర యూనిట్‌ అందించిన సమాచారం ప్రకారం.. జనవరి 17న ముంబైలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న ఆలియా.. స్వల్ప అస్వప్థతకు లోనవడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్నాక, అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

గంగూబాయితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్రా’, రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలావుండగా, ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేను ఆస్వాదించి ముంబైకి తిరిగి వచ్చింది. హాలిడేకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

  • 3
    Shares