సోనూసూద్‌ పేరుతో అంబులెన్స్‌ సర్వీసెస్‌ ప్రారంభం!

41

సోనూ సూద్ లాక్‌డౌన్ సమయంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కూడా ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. సోనూ సూద్ చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన మంచి మనసును అభినందించని వారంటూ ఎవరూ లేరు.

https://i.imgur.com/zNCvfGq.jpg

ట్యాంక్ బండ్‌ శివగా పేరు పొందిన శివ ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసును నడపనున్నారు. మంగళవారం సోనూసూద్ ఈ అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించారు. వీటి ద్వారా జంటనగరాల్లోని పేద ప్రజలకు ఉచిత సేవలు అందించనున్నారు. దాతల సాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు.
https://i.imgur.com/MS2TvKs.jpg
హుస్సేన్ సాగర్ ఏరియాలో శవాల శివగా పేరుగాంచిన శివ.. సాగర్‌లో గల్లంతైన మృతదేహాలను వెలికి తీయడంలో లేక్ పోలీసులకు సహకరిస్తుంటారు. 23 ఏళ్లుగా ఈ పనిలోనే ఉన్న శివ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన 114 మంది ప్రాణాలు కాపాడారు.

  • 19
    Shares