సినిమా

త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్న నటసింహం వారసుడు..

43

నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ జూన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజైన 10న మోక్షజ్ఞ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌లో టాక్‌. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది కూడా మొన్నటి వరకు పెద్ద క్వశ్చన్‌ మార్క్‌గా ఉండేది. దీనిపై కూడా క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాను పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌ చేస్తారట.

మోక్షజ్ఞ కోసం పూరీ ఓ స్టోరీ రెడీ చేశాడని.. అంతేకాదు ఇప్పటికే బాలయ్య కూడా ఆ స్టోరీని వినిపించాడట పూరీ. ఆ కథకు బాలయ్య కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమానే పాన్‌ ఇండియా లెవల్‌లో ఉండనుందట. కాగా  ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్వకత్వంలో సినిమా చేయనున్నాడు. వీరి కాంబోలో మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు.

  • 11
    Shares