ఆ నాలుగు బ్యాంకులు కూడా ప్రైవేటు పరం చేయబోతున్న మోదీ సర్కార్

46

బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఈ నాలుగు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులో 33 వేల మంది, బ్యాంక్ ఆఫ్​ ఇండియాలో 50 వేల మంది, ఇండియన్​ ఓవర్సీస్ బ్యాంక్ లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్రలో 13 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్​ బ్యాంక్ లాంటి మధ్య తరహా బ్యాంకుల ప్రైవటైజేషన్ సక్సెస్ అయితే​ పెద్ద బ్యాంకులను సైతం ప్రైవేట్ పరం చేస్తారని తెలుస్తోంది.

అయితే ఈ ప్రైవేటైజేషన్​ ప్రక్రియను వారంతా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.  ప్రతిపక్షాల నుంచి సైతం ఈ అంశంపై తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

  • 6
    Shares