హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. బాలుడు మృతి

36

హైదరాబాద్ లో వీధి కుక్కలు ఎనిమిది ఏళ్ల బాలుడ్ని పొట్టన పెట్టుకున్నాయి. కిషన్‌ బాగ్‌ అసద్‌ బాబానగర్‌కు చెందిన 8 ఏళ్ల అయాన్ శనివారం‌ స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగైదు కుక్కలు వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. అందరూ పారిపోగా అయాన్ ఒక్కడు మిగిలాడు. అవి బాలుడిపై దాడి చేసి ‌ తీవ్రంగా గాయపర్చడంతో అయాన్‌ మృతి చెందాడు.

ఈ ఘటనపై బల్దియా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆ ప్రాంతంలోని వీధి కుక్కల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులను ఆదేశించారు. కిషన్ బాగ్.. అసద్ బాబానగర్ ప్రాంతాల్లో రెండు వాహనాలు.. వాటితో పాటు 16 మంది డాగ్ క్యాచర్లతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుంటున్నారు.

  • 2
    Shares