వైరల్

450 సిలిండర్లతో వెళ్తున్న ట్రక్ పై పిడుగు.. 7 కిలోమీటర్ల మేరలో ముక్కలు..

32

రాజస్థాన్ లోని దిల్వారా జిల్లాలోని జైపూర్ కోట హైవే పై మంగళవారం 450 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సంత్రామ్ మీనా గాయపడ్డారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. గాయపడిన ట్రక్ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం డియోలి ఆస్పత్రికి తరలించారు.

ఈ ట్రక్ నాసిరాబాద్ నుంచి కోట భవానిమండి వైపు వెళుతోంది. అగ్ని ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు పిడుగు పడటం వల్లే మంటలు చెలరేగాయని  చెబుతున్నారు.  ఆ తర్వాత సిలిండర్లు పేలాయని పేర్కొన్నారు. సుమారు 3 గంటలపాటు సిలిండర్ల పేలుడు కొనసాగింది.

ఎల్పిజి సిలిండర్ల పేలుళ్ల కారణంగా అగ్నిమాపక దళం అధికారులు కాలిపోతున్న ట్రక్కు దగ్గరికి వెంటనే చేరుకోలేక పోయినట్లు తెలుస్తోంది. స్పాట్ నుంచి  5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప గ్రామాల నుండి సిలిండర్ల ముక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 150 మీటర్ల దూరంలో ఉండటం కూడా కష్టమనిపించిందని ఒక అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.