బిల్డింగ్ మీద నుండి పడిపోతున్న వ్యక్తిని చివరి క్షణంలో కాపాడిన యువకుడు

42

కేరళ లోని వాడకర లో ఒక భవనం యొక్క మొదటి అంతస్తులోని కారిడార్‌లో బాబురాజ, బిను అనే ఇద్దరు వ్యక్తులు గోడపైకి వాలుతూ నిలబడటం చూడవచ్చు. క్షణాల్లో, ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న వ్యక్తి వెనుకకు వాలిపోతుండగా పక్కన నిలబడి ఉన్న అప్రమత్తమైన వ్యక్తి అతని కాలు మీద పట్టుకుని పడిపోకుండా ఆపాడు. వెంటనే, ఒక పోలీసుతో సహా అక్కడే ఉన్న చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడగలిగారు.

రక్షించిన వ్యక్తి 45 ఏళ్ల తయ్యిల్ మిట్టల్ బాబూరాజ గా గుర్తించారు, మూర్చబోయిన వ్యక్తి బిను అలియాస్ బాబు. ఈ సంఘటన జరిగినప్పుడు వీరిద్దరూ కేరళ బ్యాంకులోని వడకర శాఖలోని మొదటి అంతస్తు వరండాలో నిలబడి ఉన్నారు. నివేదికల ప్రకారం, భవనం క్రింద లైవ్ వైర్ పని జరుగుతుంది, కాబట్టి అక్కడి నుండి పడిపోవడం బాబుకు ప్రాణాంతకం కావచ్చు. అంతేకాకుండా అతను పడితే మొదట తల నెలకు తాకేది.

బాబు, బాబురాజ్ ఇద్దరూ వడకరలోని కేరళ బ్యాంక్ శాఖ ఉద్యోగులు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించడానికి వారి వంతు కోసం వేచియుండగా బాబురాజ్ మూర్చబోయాడు. అప్రమత్తమైన బాబు కాపాడగలిగాడు. అంతకుముందు బాబు యుఎల్‌సిసిఎస్ (ఉరులుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) లో ఉద్యోగి. ఆ వ్యక్తిని రక్షించిన బాబూరాజ్ నిర్మాణ కార్మికుడు.