డేట్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

38

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ లతో కొరటాల శివ దర్శకత్వంలో రుపోందుతున్న చిత్రం (Acharya) ‘ఆచార్య’. మెగాభిమానులు ఈ చిత్ర టీజర్‌ కోసం ఎంతగా వెయిట్‌ చేస్తున్నారో చెప్పనవసరం లేదు. నూతన సంవత్సరం రోజున, లేదంటే.. సంక్రాంతికి ఈ చిత్ర టీజర్‌ వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఎటువంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో అభిమానులే కాదు.. చిరంజీవి కూడా కాస్త నిరాశకు లోనైనట్లుగా తాజాగా ఆయన ట్వీట్‌ చూస్తే తెలుస్తోంది.

కొరటాల శివ, చిరుల మధ్య ఈ టీజర్‌ విషయంలో జరిగిన ఆసక్తికర సంభాషణను చిరంజీవి తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉందంటే.. చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్‌ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు ఇంకెప్పుడు. కొరటాల: సార్‌.. అదే పనిలో ఉన్నా. చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కొరటాల: రేపు మార్నింగే అప్‌డేట్‌ ఇస్తా సార్‌. చిరంజీవి: ఇస్తావా.. కొరటాల: రేపు మార్నింగ్‌ 10 గంటలకు ప్రకటన.. ఫిక్స్‌ సార్‌

దీంతో ‘ఆచార్య’ టీజర్‌ ప్రకటన రేపు ఉదయం 10గంటలకు అంటూ కొరటాల అఫీషియల్‌గా ట్వీట్‌ చేశారు.

  • 7
    Shares