వంట చేస్తుండగా సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు సజీవ దహనం..

32

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చనాకా- కోర్ట ప్రాజెక్ట్‌ కార్మికుల శిబిరంలో సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గ్యాస్‌ సిలిండర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.

కార్మికులు వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడి చూస్తుండగానే వ్యాపించాయి. మంటలు అంటుకొని కూలీల్లోని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. అగ్ని ప్రమాదం సమీపంలోనే ఉన్న నాలుగు టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం అయింది. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో కూలీలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

  • 4
    Shares