ఆధార్ యాప్‌ యూజర్లకు ముఖ్య గమనిక.. వెంటనే డిలీట్ చేయండి.

44

maadhaar యాప్ సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించాలని భావించే వారు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ను డిలీట్ చేసి, లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని UIDAI సూచించింది. కొత్త వెర్షన్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

13 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ తో 35 రకాల సేవలు ఆన్ లైన్ లో పొందొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యూజర్లు అయితే యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ ఇలా 35 రకాలకు పైగా ఆన్‌లైన్ సేవలు ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

  • 4
    Shares