తండ్రి కరోనాతో చనిపోవడం ఆమె తట్టుకోలేక చితికి నిప్పంటించగానే ఆ మంటల్లోకి దూకారు.

27
రాజస్థాన్‌ బాడ్‌మేర్‌లోని రాయ్‌ కాలనీలో ఉండే దామోదర్‌దాస్‌ షార్దా(73)కు కరోనా సోకింది. ఆదివారం ఆయనను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన కరోనా తో పోరాడుతూ మంగళవారం మరణించారు. అనంతరం ఆయనకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ముగ్గురు కుమార్తెల్లో చిన్నామె అయిన చంద్ర షార్దా (34) ఉన్నట్టుండి చితి మంటల్లో దూకేశారు.

అక్కడే ఉన్న జనం ఆమెను మంటల నుంచి బయటకు లాగినప్పటికీ 70 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తొలుత ఆమెకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జోధ్‌పుర్‌ తరలించారు. వాస్తవానికి శ్మశానానికి రావొద్దని వారించినా.. కానీ చంద్ర పట్టుబట్టి మరీ అక్కడికి వచ్చారని పోలీసులు తెలిపారు.