అల్లు అర్జున్‌ కారవాన్‌ను ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు

50

అల్లు అర్జున్‌కు వాహనానికి తృటిలో ప్ర‌మాదం తప్పింది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో ఆ వాహ‌నం ఆయ‌న‌దిగా గుర్తించారు. అయితే ఆ కారులో అల్లు అర్జున్ లేడని సమాచారం.

రంపచోడవరం అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్‌ను శనివారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.

  • 8
    Shares