అల్లు స్టూడియోస్ నిర్మించాలనే ఆలోచన అప్పుడే వచ్చింది..

71

సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ షో లో స్టైలిష్ స్టార్ తో జరిగిన ఒక స్పెషల్ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఆహా యాప్ లో రిలీజ్ చేశారు. చిట్ చాట్ లో భాగంగా అల్లు స్టూడియో గురించి అడిగింది సమంత. అయితే దానికి విచిత్రమైన సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. ‘మీకు కూడా ఓ స్టూడియో ఉంది కదా.. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్తే వెల్కం టూ అన్నపూర్ణ స్టూడియోస్ అని అన్నారు. అప్పుడే ఇలాంటి మనకు ఉంటే బాగుందని అనుకున్నా’ అన్నారు అల్లు అర్జున్.

ఇకపోతే లాస్ట్ గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీగా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2020 ఎవరికి ఎలా ఉన్నా తనకు మంచి చేసిందని అన్నట్టుగా చెప్పారు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

  • 4
    Shares