4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు

65

ఈమధ్య పలువురు నటీనటులు డిప్రెషన్‌కు గురైన జాబితాలో నటుడు అమిత్‌ సాధ్‌ కూడా చేరారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలిపారు. అమిత్‌ మాట్లాడుతూ.. ‘16 నుంచి 18 ఏళ్ల వయసులో నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. ఆత్మహత్య ఆలోచనలు ఉండేవి కావు. కానీ సూసైడ్‌ చేసుకోవాలని భావించేవాడిని. ఇందుకు గాను ఓ ప్రాణాళిక అంటూ ఉండేది కాదు.

ఏదో ఓ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడిని.. అలా చేస్తూ ఉండేవాడిని’ అన్నారు. అమిత్‌ మాట్లాడుతూ.. ‘నాలుగోసారి ఆత్మహత్యాయత్నం చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఎందుకు చనిపోవడం.. గివ్‌ అప్‌ చేయడం ఎందుకు అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. అయితే ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత జీవితాన్ని ఇలా ముగించడం కరెక్ట్‌ కాదు.

ఈ లైఫ్‌ ఒక బహుమతి అని నాకు అర్థం అయ్యింది. ఆ రోజు నుంచి.. నేను జీవించడం ప్రారంభించాను. నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపించింది. జీవితం చూపిన వేలుగులో నేను పయణించాను. బలహీనుల పట్ల ఇప్పుడు నాకు చాలా కరుణ, ప్రేమ, తాదాత్మ్యం ఉన్నాయి’ అన్నాడు. ఇక అమిత్ సాధ్ నటించిన వెబ్‌ సిరీస్‌ ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ ఘన విజయం సాధించింది. అతను ‘కై పో చే!’ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌తో కలిసి నటించాడు. ‘సుల్తాన్’, ‘గోల్డ్’, ‘శకుంతల దేవి’ సినిమాల్లో నటించైనా అమిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జిడ్’.

  • 2
    Shares