యాంకర్ అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల

49

అన‌సూయ సోష‌ల్ మీడియాలో అప్పుడప్పుడు త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. మూడు పదుల వయసు ఉన్న ఈ భామ బుల్లితెరపై జబర్దస్త్ పాపులారిటీతో వెండితెర వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా ఈ హాట్ యాంక‌ర్ ఇచ్చిన షాక్‌కు ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ళ‌పెట్టారు. ఆమె ఫోటోతో ఏకంగా పోస్టర్‌ స్టాంప్‌ ముద్రించడంతో ఉబ్బితబ్బిబ్బయింది అనసూయ.

‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఆమెను తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడిస్తూ ఈ పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఈ స్టాంప్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన అనసూయ.. తనను ఇలా సత్కరించడంపై చిత్రపురి చలన చిత్రోత్సవం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

  • 8
    Shares