అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్ ఆ ఫొటో!

41

కీర్తి సురేష్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ లవ్‌లో పడినట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

ఇక కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లిపై ఇలాంటీ పుకార్లు వైరల్ కావడంతో, అనిరుధ్, కీర్తి సురేష్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి నుండి ఈ పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో ప్రస్తుతం నితిన్ రంగ్ దే, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న గుడ్ లక్ సఖి, తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాటలో కూడా నటిస్తోంది.