వ్యూస్ కోసం కోసం దిగజరిపోతున్న బడా న్యూస్ చానల్స్

43

సోషల్ మీడియా లో ఏది పడితే అది రాయడమే.. ఎవరేది చెబితే గుడ్డిగా నమ్మేసి షేర్ చేయడమే అంటే కొన్ని న్యూస్ ఛానెల్స్ ఓవర్ యాక్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్ కూడా రాయాల్సిన న్యూస్ మానేసి 36T9 లాంటి చిన్న చిన్న వెబ్సైట్ లు చేసే పనులే చేస్తుండటం గమనార్హం.

రీసెంట్ గా ఒక తెలుగు న్యూస్ చానల్ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టుంది. ట్రెండింగ్ న్యూస్ అని అప్పుడో జరిగిన వైరల్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. 2015 లో ఇరాక్ లో ప్రవహిస్తున్న ఇసుక నది అని ఒక వీడియో వైరల్ కాగా అది ఇప్పుడు ట్రెండింగ్ వీడియో అని పోస్ట్ చేసింది.

పై వీడియో 2015 లో వైరల్ కాగా అది ఇప్పుడు ట్రెండింగ్ అని ప్రముఖ న్యూస్ చానల్ షేర్ చేయడం గమనార్హం.

అయితే రీసెంట్ గా ‘శోభనానికి ఫ్లెక్సి ఏర్పాటు చేసిన కొత్త పెళ్లికొడుకు.. ఇతగాడి దూకుడికి నెట్టింట్లో నవ్వులు పువ్వులు..!‘ అంటూ ఒక ఫోటోతో వెబ్సైట్ లో పోస్ట్ షేర్ చేసింది. ఆ ఫోటో 2020 లో వైరల్ అయింది. కానీ అంతకముందు నుండి కూడా ఉండే ఉండవచ్చు. ఒక పెద్ద స్థాయిలో ఉంది ఇలాంటి పోస్టలు షేర్ చేయడంతో నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

పై ఫోటో 2020 లో షేర్ చేస్తే అది ఇప్పుడు ట్రెండింగ్ అని న్యూస్ షేర్ చేయడం గమనార్హం.