కరొన రెండో వేవ్ ఒక బూటకం.. ఆర్.నారాయణమూర్తి

57

విజయవాడలో హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం నారాయణ మూర్తి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కరోనా రెండోసారి వ్యాప్తి అంటూ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

కార్పొరేట్ సంస్థలు తయారు చేసే శానిటైజర్లు, మాస్క్‌లు, ఇతర మెడికల్‌ వస్తువులు అమ్ముకొని సొమ్ము చేసుకోవటానికే ఈ ఎత్తుగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

కరోనా మహమ్మారి వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులు మాత్రం వేల కోట్ల రూపాయిలు దండుకున్నాయని దుయ్యబట్టారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరించటం దారుణమన్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా చర్యలు చేపడుతుందని ఆర్.నారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి అందరూ మద్దతు ప్రకటించాలని ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు.