బిజెపి ఎమ్మెల్యేను బట్టలూడదీసి చితక్కొట్టిన రైతులు

67

పంజాబ్ లోని ముక్తసర్ జిల్లాలో మాలోట్ పట్టణంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన జరుగుతోంది. అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ మాలోట్ వచ్చారు. దాంతో రెచ్చిపోయిన రైతులు.. ఎమ్మెల్యే వాహనాలపై బ్లాక్ పెయింట్ చల్లారు. గన్‌మెన్లు, స్థానిక పోలీసులు ఎమ్మెల్యేను పక్కకు తీసుకెళ్తుండగా రైతులు పట్టుకుని చితక్కొట్టి బట్టలు చించేశారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎమ్మెల్యేను అక్కడ్నుంచి తీసుకెళ్లి ఒక షాపులోకి పెట్టి షట్టర్ వేశారు. ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నంలో ఫరీద్ కోట్ జిల్లా ఎస్పీ గాయపడ్డారు. ఎమ్మెల్యేపై దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖండించారు. ఈ దాడికి బీజేపీ, దాని మిత్రపక్షాలే బాధ్యత వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.