
మిర్చి ఫేమ్ రిచా గంగోపాధ్యయ మే 27న మగబిడ్డకు జన్మనిచ్చారు. శనివారం ఉదయం ఇన్స్టాగ్రామ్లో ఆ సంగతి వెల్లడించారు. చిన్నారితో పాటు భర్త జో లంగెల్లా ఫొటోను పంచుకున్నారు. అలాగే, బాబుకు లూకా షాన్ అని పేరు పెట్టామన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమకు ‘లీడర్’తో కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయకు ‘మిర్చి’లో రెండో కథానాయిక పాత్ర గుర్తింపు తెచ్చింది. ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘భాయ్’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లి… వివాహం చేసుకుని అక్కడే స్ధిరపడ్డారు. చిత్రాలకు, నటనకు పూర్తిగా దూరమయ్యారు.
View this post on Instagram