కోడలే కూతురైన వేళ.. మామను తన వీపుపై ఎక్కించుకుని 2 కిలోమీటర్లు నడిచి

కరోనాతో బాధపడుతున్న తన మామను ఓ కోడలు 2 కిలోమీటర్లు వీపుపై మోసుకుని పోయి చికిత్స చేయించింది. నిహారికా దాస్ అనే ఈ కోడలు, మామను తన వీపుపై ఎక్కించుకుని వెళ్లి 2 కిలోమీటర్లు నడిచి ఓ ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ లోగా యథాప్రకారం మొబైల్ ఉన్నవారంతా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

Image

తులేశ్వర్ దాస్ అనే ఈ వ్యక్తి, అసోంలోని భటిగావ్ లో వక్కల వ్యాపారం చేస్తుంటాడు. గత వారం రోజులుగా కరోనా లక్షణాలతో ఉన్నాడు. ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో ఇంట్లో కొడుకు కూడా లేడు. పనిమీద బయటకు వెళ్లి సిలిగురిలో ఉండిపోయాడు. కొడుకు లేకపోవడంతో కోడలే ఆయన్ను వీపుపై మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

Image

స్థానిక ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చేర్పించి ఆక్సిజన్ పెట్టించి.. మామతో సెల్ఫీ తీసుకుని భర్తకు పంపించింది కూడా. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పింది. అయితే దురదృష్టం, ఆస్పత్రికి తీసుకెళ్లిన గంటలోనే ఆయన చనిపోయాడు.

Image