పుట్ట గొడుగులు తింటే ఏమౌతుంది…

371

      పుట్టగొడుగును ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీటిలోని సిద్ధబీజాలపై, మరియు ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.

      పుట్టగొడుగు యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది .” ఇర్గోథియోనైన్‌ , సెలీనియం ” అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్‌ ‘D’ పుస్కలముగా లభిస్తుంచి నందువల్ల … ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది . మామూలుగా ఆహారములో వి్టమిన్‌’D’ లభించదు . పు్ట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ ‘D’ అందుతుంది ..అయితే దీనివలన సన్‌ట్యాన్‌కి గురి అయ్యె ప్రమాధముంది. వీటిలో మొక్కలు, జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి. జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు . భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి . మాంస్కృత్తులు లభిస్తాయి . శరీర సౌష్టవం, కండర పుష్టికి దోహదపడతాయి . పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి, కండరాలకు, ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది . గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి . డయబిటీస్ ను తగ్గిస్తుంది. పుట్టగొడుగు ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.